Header Banner

కుప్పకూలిన ఆర్మీ విమానం! 46 మంది సైనికులు దుర్మరణం!

  Thu Feb 27, 2025 10:51        Others

సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ విమానం కూలిపోయింది. వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోవడం గమనార్హం. ఇక ఈ ఘోర విమాన ప్రమాదంలో ఆ విమానంలో ప్రయాణిస్తున్న 46 మంది జవాన్లు మృతి చెందారు. అంతేకాకుండా ఆ విమానం ఇళ్ల మధ్యలో కుప్పకూలిపోవడంతో స్థానిక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10 మందికిపైగా గాయాలపాలైనట్లు సూడాన్ అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలిపారు. 

 

మంగళవారం సూడాన్‌లోని వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి ఓ ఆర్మీ విమానం టేకాఫ్‌ అయింది. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ విమానం రాడార్ నుంచి సిగ్నల్స్ కట్ అయిపోయాయి. ఈ క్రమంలోనే ప్రజలు నివసించే ప్రాంతాల్లో కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో వెళ్తున్న 46 మంది సైనికులు ప్రాణాలు విడిచారు. అంతేకాకుండా విమానం కూలిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు కూడా కొందరు మరణించారు. ఇక ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడినట్లు సూడాన్ అధికారులు బుధవారం వెల్లడించారు. 

 

ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అయితే ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వివరించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీస్తున్నట్లు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సైనిక విమానం ఎలా కూలిపోయింది.. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. మరోవైపు.. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 

 

ఇక సూడాన్‌లో గత కొంత కాలంగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. సూడాన్‌పై పట్టు సాధించడం కోసం సూడాన్ సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం ఇటీవలి కాలంలో మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలోనే న్యాలా ప్రాంతంలో ఇటీవల ఒక సైనిక విమానాన్ని కూల్చివేసినట్లు డార్ఫర్ పశ్చిమ ప్రాంతాన్ని పాలిస్తున్న ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్-ఆర్‌ఎస్‌ఎఫ్‌ ప్రకటించింది. అయితే ప్రస్తుతం జరిగిన విమాన ప్రమాదానికి.. సూడాన్‌ అంతర్యుద్ధానికి ఏదైనా సంబంధం ఉందా అని సూడాన్ అధికారులు విచారణ జరుపుతున్నారు. గతంలో లాగే ఈ సైనిక విమానాన్ని కూడా ఆర్ఎస్ఎఫ్ కూల్చివేసిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి
వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!  

 

మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు! 

 

గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!  

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!  

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Helicopter #Crash #PlaneCrash